హొయినా హొయినా లిరిక్స్ | గ్యాంగ్ లీడర్ || Hoyna hoyna Lyrics | Gang Leader



గీతం : హొయినా హొయినా

చలనచిత్రం : గ్యాంగ్ లీడర్

దర్శకత్వం : విక్రం కుమార్
తారాగణం : 
నాని, ప్రియాంక అరుల్ మోహన్, లక్ష్మి, శరన్య పొన్వన్నన్,  కార్తికెయ

నేపధ్య  గానం: అనిరుధ్, ఇన్నొ గెంగ

సాహిత్యం : అనంత శ్రీరాం, ఇన్నొ గెంగ
సంగీతం : అనిరుధ్ రవిచందర్    







వేరే కొత్త భూమిపై ఉన్నానా

ఏదో వింత రాగమే విన్నానా

వేరే కొత్త భూమిపై ఉన్నానా

ఏదో వింత రాగమే విన్నానా


పలికే పాలగువ్వతో, కులికే పూలకొమ్మతో

కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా

ఎగిరే పాలవెల్లితో, నడిచే గాజుబొమ్మతో

బంధం ముందు జన్మదా ఏమో బహుశా

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన 

ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా

హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా

కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా


I think I caught the feels this summer

Bae you're one of a kind no other

Be my sweetie, be my sugar

Had enough as a one side lover

I think I caught the feels this summer

Bae you're one of a kind no other

Be my sweetie, be my sugar

Had enough as a one side lover


నా జీవితానికి రెండో ప్రయాణముందని

దారి వేసిన చిట్టి పాదమా

నా జాతకానికి రెండో భాగముందని

చాటి చెప్పిన చిన్ని ప్రాణమా

గుండెల్లోన రెండో వైపే చూపి

సంబరాన ముంచావే నేస్తమా

నాలో నాకే రెండో రూపం చూపి

దీవించిందే నీలో పొంగే ప్రేమ

వెలిగే వేడుకవ్వనా, కలిసే కానుకవ్వనా

పెదవుల్లోన నింపనా చిరుదరహాసం

ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి

మెరుగులు దిద్ది వెయ్యనా ఇహ నా వేషం

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా

ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా

హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా

కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా


వేరే కొత్త భూమిపై ఉన్నానా

ఏదో వింత రాగమే విన్నానా

వేరే కొత్త భూమిపై ఉన్నానా

ఏదో వింత రాగమే విన్నానా



Comments

Popular posts from this blog

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్

Yamadonga Jr.NTR Dialogue