బుట్టబొమ్మా లిరిక్స్ | అల వైకుంఠపురంలో || Butta Bomma Lyrics | Ala Vaikuntapuram lo

గీతం : బుట్టబొమ్మా
చలనచిత్రం : అల వైకుంఠపురంలో(2020)
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్ 
తారాగణం : అల్లు అర్జున్, పూజ హెగ్డే 
నేపధ్య గానం: అర్మాన్ మలిక్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
సంగీతం : థమన్



ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో ..
లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్మో..

ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్మో..
ఇది చెప్పకుండ వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..


ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే..
అరె దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే..


బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే..

జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే    "2"

మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్మో
లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము..


రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు..
అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే..
గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు..
చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే..

చిన్నగా చినుకు తుంపరడిగితే
కుండపొతగా తుఫాను తెస్తివే
మాటగా మల్లెపూవునడిగితే
మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే


బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే..
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే
కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో ..
లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్మో..


ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్మో..
ఇది చెప్పకుండ వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..

Comments

Popular posts from this blog

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్

Yamadonga Jr.NTR Dialogue