కడలల్లె వేచె కనులే - డియర్ కామ్రేడ్
సినిమా : డియర్ కామ్రేడ్
పాట పేరు : కడలల్లె వేచె కనులే
పాడినది: జస్టిన్ ప్రభాకరన్, ఐష్వర్య రవిచంద్రన్, సిద్ శ్రీరాం
పాట రాసినది : రెహ్మన్
సంగీత దర్షకుడు : జస్టిన్ ప్రభాకరన్
నటులు : విజయ్ దేవెరకొండ, రష్మిక
కడలల్లె వేచె కనులే..
కదిలేను నదిలా కలలే.. //2//
వొడి చేరి ఒకటై పోయే...
వొడి చేరి ఒకటై పోయె
తీరం కోరే ప్రాయం..
విరహం పొంగెలే..
హ్రృదయం ఊగెలే..
అధరం అంచులే..
మధురం కొరెలే..
అంతెలేని ఎదొ తాపం ఏమిటిలా..
నువ్వె లేక వేదిస్తుందె వేసవిలా..
చెంత చేరి సేదతీర ప్రాయమిలా..
చేయి చాచి కొరుతుంది సాయమిలా..
కాలాలు మారినా..
నీ ద్యాస మారునా..
అడిగింది మొహమే..
నీ తోడు ఇలా ఇలా....
విరహం పొంగెలే..
హ్రృదయం ఊగెలే..
అధరం అంచులే..
మధురం కొరెలే..
కడలల్లె వేచె కనులే..
కదిలేను నదిలా కలలే.. //2//
నిన్నే నిన్నే కన్నులలో..
దాచానులే లోకముగా..
నన్నే నన్నే మలిచానే నీవుగా..
బుగ్గ మీద ముద్దె పెట్టె చిలిపితనం
ఉన్నటుంది నన్నె చుట్టె పడుచు గుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతొషాలెన్నో..
నిండిపొయె ఉండిపొయె గుండెలొతుల్లో
నీలోన చేరగా //2//
నానుంచి వేరుగా
కదిలింది ప్రాణమే
నీవైపు ఇలా ఇలా....
Comments
Post a Comment