అరెరే మనసా లిరిక్స్ | ఫలకనామ దాస్ || Arere Manasa Lyrics | Falaknama Das

 గీతం : అరెరే మనసా

చలనచిత్రం : ఫలకనామ దాస్(2019)

నేపధ్య గానం: సీడ్ శ్రీరామ్

సాహిత్యం : కిట్టు విస్సప్రగడ

సంగీతం : వివేక్ సాగర్


ఏమన్నావో ఎదతో తెలుసా

ప్రేమనుకోనా మనసా

చూడకముందే వెనకే నడిచే

తోడొకటుంది కలిసా

తెలియదే అడగడం

ఎదురై నువ్వే దొరకడం

మాయనో ఏమిటో ఏమో


అరెరే మనసా...

ఇదంతా నిజమా...

ఇకపై మనమే...

సగము సగమా...

ఏమన్నావో ఎదతో తెలుసా

ప్రేమనుకోనా మనసా


నా బ్రతుకున ఏ రోజో

ఏ పరిచయమవుతున్నా

నేనడిగినదే లేదే

కాదనుకుని పోతున్నా

ఇన్నాళ్ళుగ నా వెనకున్నది

నువ్వేనని తెలియదులే

నూరేళ్ళకు అమ్మగ మారిన

తోడే నువ్వే

ఆ' ఊరంతా మహరాజైనా

నీ ఒళ్ళో పడిపోయాక

దాసుడనైపోయానే...


అరెరే మనసా...

ఇదంతా నిజమా...

ఇకపై మనమే...

సగము సగమా...


నేనడిగిన రాగాలు

నీ ప్రణయపు మౌనాలు

నీ కురుల సమీరాలు

నే వెతికిన తీరాలు

ఇన్నాళ్ళుగ నా ఉదయానికి

ఎదురైనది శూన్యములే

తొలిసారిగ నీ ముఖమన్నది

నా వేకువలే

ఆ' ప్రాణాలే అరచేతుల్లో

పెట్టేస్తూ నా ఊపిరితో

సంతకమే చేస్తున్నా


అరెరే మనసా...

ఇదంతా నిజమా...

ఇకపై మనమే...

సగము సగమా...

అరెరే మనసా

(అరెరే మనసా)

ఇదంతా నిజమా

ఇకపై మనమే

సగము సగమా

    వీడియో  



Comments

Popular posts from this blog

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్

Yamadonga Jr.NTR Dialogue